రెండేళ్లవుతోంది.. గుర్తులేదు
ABN , First Publish Date - 2021-10-21T10:05:38+05:30 IST
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన జరిగి రెండేళ్లవుతోందని..

దిశ ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తును నేను పరిశీలించలేదు
విచారణ కమిషన్ ముందు డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వాంగ్మూలం
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన జరిగి రెండేళ్లవుతోందని, ఆ కేసుకు సంబంధించిన విషయాలు తనకు గు ర్తులేవని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు ఏ ర్పాటు చేసిన త్రి సభ్య కమిషన్ ముందు బుధవారం ప్రకాశ్‌రెడ్డి వాం గ్మూలం ఇచ్చారు. విచారణ కమిష న్ అడిగిన పలు ప్రశ్నలకు.. ‘‘నాకు తెలియదు. గుర్తులేదు. నా పరిధిలోకి రాదు’’అని ప్రకాశ్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ‘‘ఈ కేసులతో మీకేం సం బంధం లేదంటున్నారు. రెండు ప్రెస్‌మీట్‌లలో కేసు స్టేట్‌సను అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు మీరే వివరించా రు. ఇదెలా సాధ్యమైంది?’’ అని విచారణ కమిషన్ ప్రశ్నించింది. తనకు తెలిసిన అంశాలనే చెప్పానన్నా రు. ‘‘దిశ స్కూటీ టైర్ గాలితీయాలని నిందితుడు నవీన్ మిగతా వాళ్లకు చెప్పాడని ప్రెస్‌మీట్‌లో మీరు వెల్లడించారు. ఆ విషయం మీకెలా తెలిసింది?మీరిచ్చిన సమాచారంతోనే రెండు ప్రెస్‌మీట్‌లలో సజ్జనార్ వివరాలు వెల్లడించారా?’’ అని అడగగా.. ఆయ న పూర్తిగా తన సమాచారం మీదనే ఆధారపడలేద ని డీసీపీ తెలిపారు.
మీడియాపై ఆంక్షలు విధించలేం
దిశ ఎన్‌కౌంటర్ కేసు విచారణను కవర్ చేస్తున్న మీడియాపై తాము ఆంక్షలు విధించలేమని విచారణ కమిషన్ స్పష్టం చేసింది. విచారణపై ఇష్టారీతిన కథనాలు వస్తున్నాయని, మీడియాపై ఆంక్షలు విధించాలంటూ పోలీసు అధికారుల తరపు న్యాయవాదు లు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులే తప్పు చేశారనే విధంగా కథనాలున్నాయని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘పరిధి దాటి కథనాలుంటే చట్ట ప్రకా రం మీరు చర్యలు తీసుకోవచ్చు. మీడియాపై మేం ఆంక్షలు విధించబోం’’ అని కమిషన్ స్పష్టం చేసింది.