దిశ కేసులో జ్యుడిషియల్ కమిషన్ విచారణ వేగవంతం

ABN , First Publish Date - 2021-08-27T21:43:06+05:30 IST

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్‌పై జ్యుడిషియల్ కమిషన్ విచారణ వేగవంతమైంది.

దిశ కేసులో జ్యుడిషియల్ కమిషన్ విచారణ వేగవంతం

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్‌పై జ్యుడిషియల్ కమిషన్ విచారణ వేగవంతమైంది. దిశ కేసులో సుప్రీంకోర్టు నియమించిన జ్యుడిషియల్ కమిషన్ విచారణను ముమ్మరం చేసింది. ఎన్‌కౌంటర్‌కు గురైనవారి కుటుంబ సభ్యులు, పలువురు సాక్షులు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. నిన్న పలువురు సాక్షులను కమిషన్ విచారించింది. ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తీరును ప్రశ్నించింది. దిశ అత్యాచారం, హత్య తర్వాత పోలీస్ కస్టడీలో ఉండగా జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా? నిజమా? అనే విషయాన్ని కమిషన్ నిగ్గు తేల్చే పనిలో పడింది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా హైకోర్టు వేదికగా ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయంలో విచారణ ప్రారంభించింది. కమిషన్ ముందు నిందితుల కుటుంబీకులు హాజరయ్యారు. అలాగే పలువురు న్యాయవాదులు కూడా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఎన్ కౌంటర్‌కు ముందు, తర్వాత పరిణామాలపై కమిషన్ ప్రశ్నిస్తోంది.

Updated Date - 2021-08-27T21:43:06+05:30 IST