‘వినూతన్నంగా ఆలోచిస్తే చిత్ర పరిశ్రమలో రాణించవచ్చు’

ABN , First Publish Date - 2021-03-22T15:44:42+05:30 IST

శ్రమించే తత్వం, వినూత్నంగా ఆలోచిస్తే చిత్ర పరిశ్రమలో రాణించవచ్చని..

‘వినూతన్నంగా ఆలోచిస్తే చిత్ర పరిశ్రమలో రాణించవచ్చు’

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : శ్రమించే తత్వం, వినూత్నంగా ఆలోచిస్తే చిత్ర పరిశ్రమలో రాణించవచ్చని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిలిం స్టడీస్‌ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు నటుడు విశ్వక్‌సేన్‌తో కలిసి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ.. ఇతర రంగాలతో పోల్చితే సినీ రంగంలో సాంకేతికత వేగవంతంగా మార్పు చెందుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అలవర్చుకుంటేనే ఈ రంగంలో అద్భుతాలు సృష్టించగలమన్నారు. యూరోపియన్‌ దేశాలలో చిత్ర నిర్మాణం, అక్కడి సాంకేతికతపై ఇక్కడ విద్యార్థులకు వివరించేందుకు చిత్రోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు శైలేష్‌, ప్రిన్సిపాల్‌ నందన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T15:44:42+05:30 IST