పీఈటీ టీచర్లను నియమించరా? : ఆర్‌.కృష్ణయ్య

ABN , First Publish Date - 2021-12-07T08:02:37+05:30 IST

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా సెలెక్ట్‌ అయిన గురుకుల పీఈటీ అభ్యర్థులకు నాలుగేళ్లుగా నియామక పత్రాలు ఎందుకివ్వడం లేదో చెప్పాలని బీసీ

పీఈటీ టీచర్లను నియమించరా? : ఆర్‌.కృష్ణయ్య

చంటి పిల్లలతో సెలెక్ట్‌ అయిన మహిళా అభ్యర్థుల ధర్నా


బర్కత్‌పుర, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా సెలెక్ట్‌ అయిన గురుకుల పీఈటీ అభ్యర్థులకు నాలుగేళ్లుగా నియామక పత్రాలు ఎందుకివ్వడం లేదో చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా సెలెక్ట్‌ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వకుండా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి, ఉన్నతాఽధికారులు బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. సెలెక్ట్‌ అయిన పీఇటీ అభ్యర్థులు సోమవారం బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. సెలెక్ట్‌ అయిన మహిళా అభ్యర్థులు చంటి పిల్లలతో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 

Updated Date - 2021-12-07T08:02:37+05:30 IST