భూ నిర్వాసితుల ధర్నా

ABN , First Publish Date - 2021-03-23T05:12:33+05:30 IST

భూ నిర్వాసితుల ధర్నా

భూ నిర్వాసితుల ధర్నా

మల్హర్‌, మార్చి 22 : జెన్‌కో భూ ఉపరితల బొగ్గు గనుల తవ్వకాల్లో భాగంగా ఇళ్ల స్థలాలు కోల్పోయిన తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ  తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తాడిచర్లకు చెందిన నిర్వాసితులు సోమవారం ధర్నా చేశారు. రెండేళ్ల క్రితమే  నిధులు మంజూరు కాగా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల పరిహారం అందలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో  బండి రాజేంధర్‌, బండి శ్రీనివాస్‌, రావుల దుర్గరాజు, బండి బానయ్య, జంజెర్ల సత్తయ్య, దండు కొంరయ్య, జంజెర్ల రమేష్‌, కాల్వ పోచయ్య, రావుల రాజనర్సు, దండు వీరస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-23T05:12:33+05:30 IST