ధర్మారెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నా: సత్యవతి రాథోడ్

ABN , First Publish Date - 2021-02-02T00:35:10+05:30 IST

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విరాళాలపై చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. బీజేపీ నాయకులు అయిన

ధర్మారెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నా: సత్యవతి రాథోడ్

హైదరాబాద్: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విరాళాలపై చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. బీజేపీ నాయకులు అయిన కాడ కాని కాడ చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. భక్తి ముసుగులో రాముడి పేరుతో రాక్షసపనులు చేస్తున్నారని ఆక్షేపించారు. చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడికి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని, బీజేపీ నాయకులు పనిగట్టుకొని వ్యక్తిగతంగా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. వరంగల్‌ను టార్గెట్ చేసుకుని బీజేపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని, దాడులు చేసి జైలుకు వెళ్లి సానుభూతి పొందాలని బీజేపీ నేతలు చూస్తున్నారని సత్యవతి రాథోడ్ దుయ్యబట్టారు. 


అయోధ్యలో రామాలయ నిర్మాణ నిధుల సేకరణకు సంబంధించి కొద్ది రోజుల కిందట పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒక  సమావేశంలో మాట్లాడారు. ‘‘రామాలయం నిర్మాణం పేరుతో బీజేపీ శ్రేణులు ఇంటింటికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దొంగ బుక్కులు పట్టుకొని చందాల దందాలకు పాల్పడుతున్నారు. గుడి నిర్మాణం పేరుతో తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు రూ.1000కోట్లు వసూలు చేస్తున్నారు’’ అని ఆరోపించారు.

Updated Date - 2021-02-02T00:35:10+05:30 IST