ర్యాలీలు, సభలపై జనవరి 2 వరకూ నిషేధం : డీజీపీ మహేందర్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-12-30T19:50:59+05:30 IST
కొవిడ్ నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలను జనవరి 2 వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్ : కొవిడ్ నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలను జనవరి 2 వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలు అవుతాయన్నారు. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలు అమలు చేయాలని పోలీసులకు తెలిపామన్నారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలన్నారు. కొవిడ్ నిబంధనల్లో ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలు అమలు చేస్తామన్నారు. ఎయిర్ పోర్ట్‌లో కూడా టెస్టులు చేసి, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. పబ్బులు, ఈవెంట్స్‌పై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాలన్నారు.