లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ ఆదేశాలు
ABN , First Publish Date - 2021-05-20T16:39:02+05:30 IST
లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్: లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. నాలుగు గంటల సడలింపుతో రోడ్లపైకి విచ్చల విడిగా వందలాది వాహనాలు వస్తున్నాయి. దీంతో బేగంపేట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రెండు కిలో మీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో రెండు అంబులెన్స్‌లు చిక్కుకున్నాయి. రిలాక్సేషన్ తరువాత కూడా అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.