ఇళ్లను కూల్చివేయడం దారుణం: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
ABN , First Publish Date - 2021-08-04T01:08:04+05:30 IST
పాత కొత్తగూడెంలో ముందస్తు హెచ్చరికలు లేకుండా.. ఇళ్లను కూల్చివేయడం దారుణమని మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తప్పుబట్టారు.

భద్రాద్రి కొత్తగూడెం: పాత కొత్తగూడెంలో ముందస్తు హెచ్చరికలు లేకుండా.. ఇళ్లను కూల్చివేయడం దారుణమని మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తప్పుబట్టారు. పాత కొత్తగూడెంలో ఇళ్లను రైల్వే అధికారులు కూల్చివేశారు. విషయం తెలిసుకున్న ప్రవీణ్‌కుమార్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులకు వెంటనే ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాధితులకు ఇచ్చిన హామీలను నిరవేర్చకపోతే ప్రత్యేక్ష ఆందోళనలకు దిగుతామని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు.