ప్రతిపక్షాలకు చెంపపెట్టు: తలసాని
ABN , First Publish Date - 2021-03-21T08:21:37+05:30 IST
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు అని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ అన్నారు.

మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు అని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్‌పైన ఉన్న నమ్మకంతోనే పట్టభద్రులు, ఉద్యోగులు వాణీదేవికి ఓటు వేసి గెలిపించారని చెప్పారు. నోటికొచ్చినట్లు మాట్లాడే ప్రతిపక్ష పార్టీలకు ఓట్ల రూపంలో పట్టభద్రులు, ఉద్యోగులు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.