రాష్ట్రానికి రూ.1000 కోట్ల అప్పు !
ABN , First Publish Date - 2021-01-20T09:00:54+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో వెయ్యి కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఆర్‌బీఐ ఆధ్వర్యంలో బాండ్ల వేలం నిర్వహించారు.

బాండ్ల వేలం ద్వారా సర్కారు స్వీకరణ
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో వెయ్యి కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఆర్‌బీఐ ఆధ్వర్యంలో బాండ్ల వేలం నిర్వహించారు. ఈ వేలం ద్వారా ప్రభుత్వం రూ. 1000 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ రుణానికి సంబంధించి 6.62 శాతం వడ్డీని చెల్లించనుంది. రుణాన్ని వచ్చే 20 ఏళ్ల లోపు తిరిగి చెల్లించనుంది. కాగా, కరోనా కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన ఆదాయం విషయంలో ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణాలను తీసుకుంటోంది.