విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-12-31T05:39:36+05:30 IST
విద్యుదాఘాతంతో యువకుడి మృతి

నల్లబెల్లి, డిసెంబరు 30: విద్యుదాఘా తంతో యువకుడు మృతి చెందిన సం ఘటన నల్లబెల్లి మండలంలోని బిల్ నాయక్ తండాలో గురువారం సాయం త్రం చోటుచేసు కుంది. స్థానికుల కథనం ప్రకారం.. రామతీర్థం గ్రామానికి చెందిన ఇనుగాల రాజేష్ (23) రామతీర్థం గ్రామ పంచాయితీలో మల్టీపర్పస్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే బిల్‌నాయక్ తండా గ్రామంలో డీజే వైరును సరిచేస్తుండగా అకస్మాత్తుగా షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి విద్యు దాఘాతంతో రాజేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. రాజేష్ మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.