కోళ్లు, కాకుల మృత్యువాత
ABN , First Publish Date - 2021-02-06T06:31:16+05:30 IST
కోళ్లు, కాకులు మృతి చెందుతున్న సంఘటనలు వికారాబాద్ జిల్లాలో కొనసాగుతూనే ఉన్నా యి. ధారూరు మండల పరిధిలోని దోర్నాలలో రెండు రోజుల క్రితం కోళ్లు మృతి చెందగా.

వికారాబాద్ జిల్లా మైలారంలో ఘటన
ధారూరు, ఫిబ్రవరి 5: కోళ్లు, కాకులు మృతి చెందుతున్న సంఘటనలు వికారాబాద్ జిల్లాలో కొనసాగుతూనే ఉన్నా యి. ధారూరు మండల పరిధిలోని దోర్నాలలో రెండు రోజుల క్రితం కోళ్లు మృతి చెందగా.. తాజాగా మైలారంలోనూ ఒక మేకతోపాటు మూడు కోళ్లు, కాకులు మృత్యువాత పడ్డాయి. వికారాబాద్ పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు సదానందం, ఇన్‌చార్జి వైద్యాధికారి హతీరాం గ్రామాన్ని సందర్శించి.. మృతి చెందిన కోళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పించారు. వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే కోళ్లు మృతి చెందాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ముందు జాగ్రత్తగా గ్రామంలోని కోళ్లకు నట్టల నివారణ మందు వేశారు.