చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-10-22T05:08:18+05:30 IST
చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
రాయపర్తి, అక్టోబరు 21 : చేపల వేటకు వెళ్లి ప్రమాదవ శాత్తు నీటిలో పడి ఒకరు మృతిచెందిన సంఘటన మండలంలోని మైలారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రాయ పర్తి ఎస్సై బండారి రాజు కథనం ప్రకారం.. మండలంలోని ఊకల్లు గ్రా మానికి చెందిన పాలకుర్తి సార య్య(40) బంధువులతో కలిసి చేపల వేట కోసమని మైలారం రిజర్వాయర్ వద్దకు వచ్చాడు. చేపలు పడుతుం డగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందాడు. సార య్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.