గొర్రెల యూనిట్ల కోసం డీడీలు ఇవ్వాలి: తలసాని

ABN , First Publish Date - 2021-11-09T07:42:05+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేస్తున్న గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులు తమ వాటా కింద చెల్లించాల్సిన నగదును డీడీ(డిమాండ్‌ డ్రాఫ్ట్‌) రూపంలో సంబంధిత అధికారులకు అందజేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు.

గొర్రెల యూనిట్ల కోసం డీడీలు ఇవ్వాలి: తలసాని

హైదరాబాద్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేస్తున్న గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులు తమ వాటా కింద చెల్లించాల్సిన నగదును డీడీ(డిమాండ్‌ డ్రాఫ్ట్‌) రూపంలో సంబంధిత అధికారులకు అందజేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పెంచిన యూనిట్‌ విలువకు అనుగుణంగా 4,761 మంది లబ్ధిదారులు ఇప్పటికే డీడీలు చెల్లించారన్నారు. 1,119 మందికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామని మంత్రి చెప్పారు. మిగిలిన లబ్ధిదారులు కూడా డీడీలు చెల్లిస్తే యూనిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే.. ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20లోపు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.  

Updated Date - 2021-11-09T07:42:05+05:30 IST