మీడియామంత్ర’ యాప్‌ను ఆవిష్కరించిన దత్తాత్రేయ

ABN , First Publish Date - 2021-09-02T09:43:30+05:30 IST

: దశాబ్ద కాలంగా సోషల్‌ మీడియా సామాన్యుని జీవితాన్ని ప్రభావితం చేస్తోందని హిమాచ ల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు.

మీడియామంత్ర’ యాప్‌ను ఆవిష్కరించిన దత్తాత్రేయ

కృష్ణానగర్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): దశాబ్ద కాలంగా సోషల్‌ మీడియా సామాన్యుని జీవితాన్ని ప్రభావితం చేస్తోందని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన ‘మీడియామంత్ర’ యాప్‌ను ఆవిష్కరించారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలలో ఖాతాలులేనివారుండరంటే అతిశయోక్తికాదన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు మీడియామంత్ర యాప్‌ దోహదపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ముద్ర, జన్‌ధన్‌ ఖాతాలు, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, అటల్‌ పెన్షన్‌ యోజన వంటి పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్‌లో పొందుపరిచినట్లు వివరించారు.  సామాన్యులకు ఈ సమాచారం ఎంతో అవసరమని గుర్తించిన యాప్‌ తయారీదార్లను ఆయన అభినందించారు. 


Updated Date - 2021-09-02T09:43:30+05:30 IST