దర్బంగా బ్లాస్ట్ కేసులో వెలుగులోకి కీలక అంశాలు

ABN , First Publish Date - 2021-08-20T15:55:14+05:30 IST

దర్బంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. దర్భాంగా పేలుడు ప్లాన్‌లో నిందితులకు హవాలా రూపంలో డబ్బు అందినట్టు అధికారులు గుర్తించారు.

దర్బంగా బ్లాస్ట్ కేసులో వెలుగులోకి కీలక అంశాలు

హైదరాబాద్: దర్బంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. దర్భాంగా పేలుడు ప్లాన్‌లో నిందితులకు హవాలా రూపంలో డబ్బు అందినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ మల్లేపల్లిలో ఉన్న మాలిక్ సోదరులకు హవాలాతో హాజీ సలీం డబ్బు చేరవేశారు. బట్టల వ్యాపారంలో నాసిర్ మాలిక్ తీవ్ర నష్టాలు చవిచూశాడు. యూపీ ఖైరానాకు చెందిన ఇక్బాల్ ఖానాను సంప్రదించాలని పలువురు సలహా ఇచ్చారు. దీంతో పదేళ్ల క్రితం పాకిస్తాన్ వెళ్లి ఇక్బాల్ ఖానాని నాసిర్ కలిశాడు. అప్పుడే కెమికల్ బాంబుల తయారీ విధానాన్ని నేర్చుకున్నాడు. సొంత జిల్లా కైరానాలో హాజీ సలీంతో కలిసి రైలు, బస్సు బ్లాస్ట్‌లకు ప్లాన్ చేశారు. దీనికోసం నాసిర్ మాలిక్‌కు హవాలా రూపంలో డబ్బు సరఫరా చేశారు. ఆ డబ్బుతోనే నాసిర్ మాలిక్ కెమికల్ బ్లాస్ట్ ప్లాన్ చేశాడు. పాకిస్తాన్‌లో ఉండి బ్లాస్ట్‌లకు లష్కరే తోయిబా ప్లాన్ చేసింది. 

Updated Date - 2021-08-20T15:55:14+05:30 IST