నిర్మాత సురేష్‌బాబుని మోసగించిన కేసులో వెలుగులోకి సరికొత్త విషయాలు..

ABN , First Publish Date - 2021-06-22T19:04:17+05:30 IST

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుని వ్యాక్సిన్ పేరుతో ఓ కేటుగాడు బురిడీ కొట్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా..

నిర్మాత సురేష్‌బాబుని మోసగించిన కేసులో వెలుగులోకి సరికొత్త విషయాలు..

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుని వ్యాక్సిన్ పేరుతో ఓ కేటుగాడు బురిడీ కొట్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఈ కేసు విచారణలో ఎన్నో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నాగార్జున రెడ్డి అసలు పేరు నాగేంద్రబాబుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నాగేంద్రబాబుపై ఆరు కేసులు మోదయ్యాయి. సైబరాబాద్‌లో మూడు కేసులు, హైద్రాబాద్‌లో రెండు కేసులు, విజయవాడలో ఒక కేసు నమోదైంది. అంతేకాదు.. గతంలో ఫిల్మ్ ఫేర్ అవార్డు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడ్డాడు. 


అలాగే ఎయిర్‌టెల్ ప్రైవేట్ నంబర్స్ ఇప్పిస్తానని సైతం నాగేంద్రబాబు మోసాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. తన దగ్గర 500 వ్యాక్సిన్‌లు ఉన్నాయని చెప్పి సురేష్‌బాబుని నమ్మించి లక్ష రూపాయలు ట్రాన్సఫర్ చేయమన్నాడు. దీంతో కేటుగాడిని నమ్మిన సురేష్ బాబు తన మేనేజర్‌కు చెప్పడంతో లక్ష ట్రాన్స్‌ఫర్ చేశారు. అనంతరం కేటుగాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-06-22T19:04:17+05:30 IST