అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు

ABN , First Publish Date - 2021-01-14T04:46:45+05:30 IST

అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు

అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

రాయపర్తి, జనవరి 13 : అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందేలా కృషి చేస్తానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో రూ.227 కోట్ల నిధులు 4126 ఇండ్లకు మంజూరు చేసినట్లు వివరించారు. బుధవారం మండలంలోని మైలారంలో నిర్మించిన 50 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను అర్హులైన పేదలకు అందించారు. రాష్ట్రంలో 2,84,357 ఇండ్లు నిర్మిస్తున్నామని, మరిన్ని నిర్మించడానికి కార్యాచరణ రూపొ ందుతున్నదని తెలిపారు. దేవాదుల ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్‌ ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, స్థానికంగా ప్రజలందరికీ విడతల వారిగా టీకాలు ఇస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హరిత, ఆర్డీవో మహేందర్‌ జీ, డీఆర్డీవో పీడీ సంపత్‌రావు, ఐబీ, పీఆర్‌ డీఈలు, ఏఈ అమర్‌నాధ్‌, ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్‌, సర్పంచ్‌ సుమతి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T04:46:45+05:30 IST