దా‘రుణ’ దందా సూత్రధారులైన చైనీయులపై పోలీసుల నజర్‌

ABN , First Publish Date - 2021-01-20T09:12:48+05:30 IST

ఇన్‌స్టంట్‌ రుణాల పేరిట లక్షలాది మందిని వేధించిన చైనా లోన్‌ యాప్స్‌ నిర్వాహకులపై సైబర్‌క్రైం పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు ప్రారంభించారు.

దా‘రుణ’ దందా సూత్రధారులైన చైనీయులపై పోలీసుల నజర్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టంట్‌ రుణాల పేరిట లక్షలాది మందిని వేధించిన చైనా లోన్‌ యాప్స్‌ నిర్వాహకులపై సైబర్‌క్రైం పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు ప్రారంభించారు. నెల రోజుల నుంచి దృష్టి సారించిన మూడు కమిషనరేట్ల సైబర్‌క్రైం పోలీసులు.. ముగ్గురు చైనీయులతో సహా 30మందికి పైగా నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తేడా వస్తే ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇక్కడివారినే డైరెక్టర్లుగా ముందుంచి చైనీయులే అన్ని వ్యవహారాలనూ నడిపేవారని దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆయా కంపెనీల సూత్రధారుల కోసం వేట ప్రారంభించారు. లోన్‌ యాప్స్‌పై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారనే సమాచారంతో ఎంతో మంది యాప్‌ డైరెక్టర్లు చైనాకు పారిపోయి అక్కడ తల దాచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో వారిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చైనాకు పారిపోయిన డైరెక్టర్ల కోసం రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు.

Updated Date - 2021-01-20T09:12:48+05:30 IST