మాదక ద్రవ్యాల నియంత్రణకు సహకరించండి:సైబరాబాద్‌ పోలీసులు

ABN , First Publish Date - 2021-10-25T20:51:17+05:30 IST

సైబరాబాద్‌ పరిధిలో మాదక ద్రవ్యాల నియంత్రణ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సైబరాబాద్‌ పోలీసులు పేర్కొన్నారు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు సహకరించండి:సైబరాబాద్‌ పోలీసులు

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో మాదక ద్రవ్యాల నియంత్రణ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సైబరాబాద్‌ పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి,గుట్కా, ఇతర నార్కోటిక్స్‌ పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు అధికారులు ఒక వాట్సప్‌ను గ్రూపు ఏర్పాటు చేశారు. ఎవరైనా, ఎక్కడైనా మాదక ద్రవ్యాల అమ్మకాలుచేసినా, పంపిణీ చేసినా, రవాణా, గంజాయి చెట్లను పంచినా దానికి సంబంధించిన సమాచారాన్ని 9490617444 నెంబర్‌కు వాట్సప్‌ ద్వారా సమాచారాన్ని పంపించాలని సైబరాబాద్‌ పోలీసులు ట్విటర్‌లో కోరారు. అలాగే వివిధ రకాల ప్రచార సాధనాల ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. 

Updated Date - 2021-10-25T20:51:17+05:30 IST