మేం అధికారంలోకొస్తే కేసీఆర్‌ ఫాంహౌ్‌సకు కరెంట్‌ కట్‌

ABN , First Publish Date - 2021-08-27T10:16:38+05:30 IST

తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సకు కరెంట్‌ కట్‌ చేసి బహుజనుల పవర్‌ ఏంటో చూపుతామని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

మేం అధికారంలోకొస్తే కేసీఆర్‌ ఫాంహౌ్‌సకు కరెంట్‌ కట్‌

బీఎస్పీ నేత ప్రవీణ్‌ కుమార్‌


గణేశ్‌నగర్‌(కరీంనగర్‌), ఆగస్టు 26: తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సకు కరెంట్‌ కట్‌ చేసి బహుజనుల పవర్‌ ఏంటో చూపుతామని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో గురువారం నిర్వహించిన  ఉమ్మడి జిల్లా పార్టీ సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడారు.  దళితుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు. ఏడేళ్లలో ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలోనే దళితుల అభివృద్ధి గురించి టీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించడం కోసం రాష్ట్రప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని  విమర్శించారు. రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ఎందుకు విచారణ జరపడం లేదో చెప్పాలన్నారు. బూతు పదాలు మాట్లాడటం రాజకీయ నాయకులకు ఫ్యాషన్‌గా మారిందని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డిని సమాజం నుంచి బహిష్కరించాలన్నారు.  

Updated Date - 2021-08-27T10:16:38+05:30 IST