కూంబింగ్ బలగాల బస్సు పేల్చివేత
ABN , First Publish Date - 2021-03-24T07:51:28+05:30 IST
కూంబింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న డీఆర్జీ జవాన్లే టార్గెట్‌గా మావోయిస్టులు ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు.

ఛత్తీస్ గఢ్లో ఐదుగురు డీఆర్జీ జవాన్ల దుర్మరణం
దుమ్ముగూడెం మార్చి 23: కూంబింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న డీఆర్జీ జవాన్లే టార్గెట్‌గా మావోయిస్టులు ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలోని దౌడాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 40మంది జవాన్లు కూంబింగ్ నుంచి తిరిగి వస్తుండగా.. మావోయిస్టులు వారి బస్సును ఐఈడీతో పేల్చారు. ఐదుగురు జవాన్లు మృతిచెందగా, 12 మంది గాయాలపాలయ్యారు.