4న యువతకు జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు

ABN , First Publish Date - 2022-01-01T05:15:07+05:30 IST

4న యువతకు జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు

4న యువతకు జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు

వరంగల్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 31: గ్రామీణ యువతలో కళానైపుణ్యాన్ని, వెలికి తీసేందుకు 4న జిల్లా స్థాయిలో యువతకు సాంస్కృతిక పోటీలు వరంగల్‌ ఓసిటీలో మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ బి.గోపి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో యువతకు పోటీలు నిర్వహించి  విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్టు కలెక్టర్‌ పేర్కొన్నారు. జానపద గేయాలు, జానపద నృత్యా లు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలకు 9985145041, 9948185608, 77021 55096 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Updated Date - 2022-01-01T05:15:07+05:30 IST