యాసంగిలోనూ సాగు జోరు

ABN , First Publish Date - 2021-02-01T08:47:44+05:30 IST

రాష్ట్రంలో యాసంగి సీజన్‌లోనూ రికార్డు స్థాయులో పంటలు సాగవుతున్నాయి. నిరుడు యాసంగి సీజన్‌తో పోలిస్తే సాగు విస్తీర్ణం ఇప్పటికే 10 లక్షల ఎకరాలకుపైగా పెరిగింది. యాసంగిలో రాష్ట్రవ్యాప్త సాధారణ సాగు

యాసంగిలోనూ సాగు జోరు

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాసంగి సీజన్‌లోనూ రికార్డు స్థాయులో పంటలు సాగవుతున్నాయి. నిరుడు యాసంగి సీజన్‌తో పోలిస్తే సాగు విస్తీర్ణం ఇప్పటికే 10 లక్షల ఎకరాలకుపైగా పెరిగింది. యాసంగిలో రాష్ట్రవ్యాప్త సాధారణ సాగు విస్తీర్ణం 36,93,016 ఎకరాలు కాగా... ఇప్పటికే 42,57,325 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగుచేస్తున్నారు. యాసంగి సీజన్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 22,19,326 ఎకరాలు కాగా.. ఏకంగా 32,14,559 ఎకరాల్లో పంట వేశారు. సాధారణ సాగుతో పోలిస్తే ఇది 45 శాతం అధికమని వ్యవసాయశాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. యాసంగిలో ఎక్కువ సాగుచేసే మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4,04,860 ఎకరాలు కాగా.. కేవలం 2,95,614 ఎకరాల్లోనే రైతులు మక్కలు వేశారు. 3,06,758 ఎకరాల్లో శనగలు, 36,297 ఎకరాల్లో మినుములు, 2,16,274 ఎకరాల్లో  వేరుసెనగ, 13,811 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 10,990 ఎకరాల్లో చెరుకు సాగుచేస్తున్నారు.  

Updated Date - 2021-02-01T08:47:44+05:30 IST