రూ.2500లకే సీటీ స్కాన్‌

ABN , First Publish Date - 2021-05-18T05:55:18+05:30 IST

రూ.2500లకే సీటీ స్కాన్‌

రూ.2500లకే సీటీ స్కాన్‌

రేట్లు తగ్గించిన ఆస్పత్రుల యాజమాన్యాలు

జనగామటౌన్‌, మే 17: జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్‌ రేటును రూ.5వేల నుంచి రూ.2,500 తగ్గించినట్లు సీటీ స్కాన్‌ ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధి డాక్టర్‌ కృష్ణ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మహేందర్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి రేట్లను తగ్గించారు. ఈ నెల 18 నుంచి సీటీ స్కాన్‌ ఫిల్మ్‌తో కలిపి రూ.2500, ఫిల్మ్‌ లేకుండా రూ.2000కు తీస్తారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - 2021-05-18T05:55:18+05:30 IST