ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్‌పేషెంట్‌ క్లినిక్‌లను ప్రారంభించండి- సీఎస్‌

ABN , First Publish Date - 2021-05-03T01:09:19+05:30 IST

జీహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానాల్లో వెంటనే ఔట్‌ పేషెంట్‌ క్లినిక్‌లను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు

ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్‌పేషెంట్‌ క్లినిక్‌లను ప్రారంభించండి- సీఎస్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానాల్లో వెంటనే ఔట్‌ పేషెంట్‌ క్లినిక్‌లను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన జోనల్‌కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ఆస్పత్రులు పీహెచ్‌సిలు, బస్తీ దవాఖానాల్లో ఔట్‌పేషెంట్‌ క్లీనిక్‌లలో జ్వరం, కరోనా లక్షణాలు ఉన్న రోగులను పరీక్షించి అవసరమైన ఇంట్లోనే చికిత్సఅందించేందుకు కిట్‌లను అందజేయాలని అన్నారు. ప్రత్యేకించి మున్సిపల్‌స్టాఫ్‌, ఎఎన్‌ఎం, కనీసం ఇద్దరు ఆశావర్కర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం, ఇతర కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి మెడికల్‌కిట్స్‌, వైద్య సలహాలు ఇవ్వాలని చెప్పారు. 


అలాగే వారు కరోనా నిబంధనలు పాటించేలా చూడడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, అర్బన్‌హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆస్పత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అవసరమైన భవకాలకు రంగులు సున్నాలు, రంగులు వేయించాలన్నారు. జీహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని సర్కిళ్ల పరిధిలో వెంటనే కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా ప్రారంభించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అదికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ ఏ ఎం రిజ్వీ, జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, పబ్లిక్‌హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు ఇతర అధికారులను పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-03T01:09:19+05:30 IST