నాలా విస్తరణ పనులపై సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం

ABN , First Publish Date - 2021-12-15T21:56:38+05:30 IST

జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్.ఎన్.డీ.పీ.) పై బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

నాలా విస్తరణ పనులపై సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్.ఎన్.డీ.పీ.) పై బీఆర్కేఆర్ భవన్ లో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా పనులు వేగంగాపూర్తి చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. నాలాల పూడిక వల్ల వర్షాలుపడితే నగరంలో రోడ్లపైకి నీరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రతి సారీ నగరంలో భారీ వర్షాలు పడితే నాలాలు పొంగడం వల్ల అనేక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. 


మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ఈ.ఎన్.సి జియాఉద్దీన్, జోనల్ కమీషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-12-15T21:56:38+05:30 IST