హౌసింగ్ ప్రాజెక్టులపై సీఎస్ సమావేశం
ABN , First Publish Date - 2021-10-29T01:50:45+05:30 IST
తెలంగాణలో కొనసాగుతున్న వివిధ హౌసింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న వివిధ హౌసింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్టులతో పాటు రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులను కూడా ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులపై ఒక యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్‌శర్మ, మున్సిపల్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, లా సెక్రటరీ సంతోష్ రెడ్డి, ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రోనాల్డ్‌రాస్ వివిధ జిల్లాల కలె క్టర్లు, హెచ్ఎండి , హౌసింగ్‌బోర్డు అధికారులు పాల్గొన్నారు.