సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచండి:సీఎస్

ABN , First Publish Date - 2021-10-25T20:02:34+05:30 IST

తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలుగా అపరాలు, నూనెగింజల సాగుకు అవసరమైన విత్తనాలను సరిపడా సేకరించి రైతులకు అందుబాటులో ఉంచాని విత్తన కంపెనీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విత్తన కంపెనీలకు సూచించారు.

సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచండి:సీఎస్

హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలుగా అపరాలు, నూనెగింజల సాగుకు అవసరమైన విత్తనాలను సరిపడా సేకరించి రైతులకు అందుబాటులో ఉంచాని విత్తన కంపెనీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విత్తన కంపెనీలకు సూచించారు. తెలంగాణలో ఉన్న వాతావరణం వేరు శనగ, పెసలు, మినుములు, శనగలు, నువ్వులు, ఆముదములు, సజ్జలు, నూనె గింజల పంటలకు యాసంగిలో సాగుకు అనువుగా ఉంటుందని అన్నారు. యాసంగిలో వరధాన్యాన్ని ఎఫ్ సి ఐ వారు సేకరించడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు యాసంగి సీజన్ లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై  రాష్ట్రంలోని 36 విత్తన కంపెనీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బి.ఆర్. కే.ఆర్. భవన్లో సమావేశం నిర్వహించారు. 


ఎఫ్. సి.ఐ. నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయం పంటల సాగుపై  చర్చించుటకు అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యానవనం శాఖల అధికారులు, శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 2603 రైతువేదికల ద్వారా ఈ నెల 27, 28, 29 తేదీలలో రైతులకు,  వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన సదస్సులు నిర్వహించనునట్లు ఆయన చెప్పారు. రైతులకు అవసరమైన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలని విత్తన కంపెనీలను సీఎస్ కోరారు. 

Updated Date - 2021-10-25T20:02:34+05:30 IST