రూ.867.51 కోట్ల పనులకు అనుమతించిన రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీ

ABN , First Publish Date - 2021-02-06T01:45:21+05:30 IST

ప్రధాన మంత్రి గ్రామసడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై) పధకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి

రూ.867.51 కోట్ల పనులకు అనుమతించిన రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీ

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి గ్రామసడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై) పధకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి ఏర్పాటయిన రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలోరాష్ట్రంలో రూ. 867.51 కోట్లతో  1412.96 కి.మీ. మేరకు 225 రోడ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. పీఎంజీఎస్‌వై పధకం మూడో దశ కింద దీనిని మంజూరు చేశారు. నిధులు మంజూరుకు వెంటనే ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. 


ఈపనులకు సంబంధించి నిధుల్లో కేంద్రం, రాష్ట్ర వాటాలు  60:40 నిష్పత్తిలో ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పధకం కింద జరుగుతున్నపనులను కూడా సమీక్షించింది. ఈ సమావేశంలో అటవీశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతకుమారి, ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, పంచాచితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T01:45:21+05:30 IST