ఓటు హక్కు వినియోగించుకున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ABN , First Publish Date - 2021-03-14T20:32:30+05:30 IST

పట్టభద్రుల నియోజక వర్గం ఎమ్మెల్సీకి జరిగిన పోలింగ్‌లో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

హైదరాబాద్‌: పట్టభద్రుల నియోజక వర్గం ఎమ్మెల్సీకి జరిగిన పోలింగ్‌లో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆదివారం రాజేంద్రనగర్‌ మున్సిపాలిటీలోని ఉప్పరపల్లిలోని అమర్‌ ఇంటర్‌నేషనల్‌స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఆయనసాధారణ ఓటర్‌గా క్యూలో నిలుచుని ఓటు వేశారు. ఆయన సతీమణి జ్ఞాన్‌ ముద్ర కూడా అదే పోలింగ్‌స్టేషన్‌లో ఓటు వేశారు. పోలింగ్‌సందర్భంగా పట్ఠభద్ర ఓటర్లు పెద్దసంఖ్యలో తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Updated Date - 2021-03-14T20:32:30+05:30 IST