మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎస్

ABN , First Publish Date - 2021-09-03T22:35:25+05:30 IST

గణేష్ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎస్

హైదరాబాద్: గణేష్ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ తలపెట్టిన మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ  కార్యక్రమాన్ని బి.ఆర్.కె.ఆర్.భవన్‌లో ఆయన ప్రారంభించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా హెచ్ఎండిఏ తరపున 70,000 మట్టి గణేష్ విగ్రహాలను హైదరాబాద్‌లోని 30 ప్రదేశాలలో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.


ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 4 నుండి 10 వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో 30 కేంద్రాలలో మరియు 4 మొబైల్ వ్యాన్‌లతో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 100 కంటే ఎక్కువ విగ్రహాలు అవసరమైన వారు హెచ్ఎండిఏ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండిఏ కమీషనర్ అర్వింద్ కుమార్,  చీఫ్ ఇంజనీర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T22:35:25+05:30 IST