మార్చి15 నాటికి పీఎంజీఎస్‌వై కోసం అటవీ క్లియరెన్స్‌ పూర్తిచేస్తాం- సీఎస్‌

ABN , First Publish Date - 2021-02-09T01:22:43+05:30 IST

ప్రధాన మంత్రి గ్రామ సడక్‌యోజన(పీఎంజీఎస్‌వై) పధకం కింద తెలంగాణ రాష్ట్రంలో జరిగే రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి మార్చి 15వ తేదీ

మార్చి15 నాటికి పీఎంజీఎస్‌వై కోసం అటవీ క్లియరెన్స్‌ పూర్తిచేస్తాం- సీఎస్‌

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి గ్రామ సడక్‌యోజన(పీఎంజీఎస్‌వై) పధకం కింద తెలంగాణ రాష్ట్రంలో జరిగే రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి మార్చి 15వ తేదీ నాటికి అటవీ క్లియరెన్స్‌ పూర్తిచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌స్పష్టం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నాగేంద్ర నాధ్‌ సిన్హా సోమవారం దేశంలోని అన్ని రాష్ర్టాల సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నరోడ్లు పనులకు సంబంధించి అటవీ క్లియరెన్స్‌కు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.


పీఎంజీఎస్‌వై పధకంలో భాగంగా జరుగుతున్న రోడ్డు పనులకు ఆటంకాలు రాకుండా ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు అటవీ క్లియరెన్స్‌ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని  కోరారు. రోడ్డు నిర్మాణాల్లో భూములను కోల్పోయే వారికి నష్టపరిహారం ఇచ్చే విషయంలో వారం వారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం, సరైన సమయంలో అటవీ క్లియరెన్స్‌ ఇచ్చే విషయంలో చర్యలు తీసుకుంటున్నట్టు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వివరించారు. ఈ సమావేశంలో ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతకుమారి, ఆర్‌అండ్‌బి ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌శర్మ, పంచాయితీరాజ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, అటవీశాఖ పీసీసీఎఫ్‌ శోభ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-09T01:22:43+05:30 IST