హైదరాబాద్‌లో 100% వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి: సీఎస్‌

ABN , First Publish Date - 2021-08-20T09:03:36+05:30 IST

రాబోయే 10-15 రోజుల్లో హైదరాబాద్‌ను కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తయిన నగరంగా మార్చడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన..

హైదరాబాద్‌లో 100% వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి: సీఎస్‌

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాబోయే 10-15 రోజుల్లో హైదరాబాద్‌ను కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తయిన నగరంగా మార్చడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ తెలిపారు. బీఆర్కే భవన్‌లో గురువారం ఈ అంశంపై వైద్యఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు, నాలుగు జిల్లాల కలెక్టర్లతో వర్క్‌షాప్‌ నిర్వహించారు. నగరంలో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి 18 ఏళ్లు పైబడిన వారందరినీ గుర్తించాలని చెప్పారు. దీనిని ఒక ఉద్యమంగా చేపట్టాలన్నారు. మొబైల్‌ వాక్సినేషన్‌కు మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎస్‌.హరీశ్‌, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎం.హన్మంతరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-20T09:03:36+05:30 IST