వ్యాక్సినేషన్‌పై సీఎస్ సమీక్ష

ABN , First Publish Date - 2021-08-22T00:17:55+05:30 IST

రాష్రంలో కరోనా నియంత్రణ కోసం జరుగుతున్న వ్యాక్సినేషన్‌పై సీఎస్ సోమేశ్ కుమార్

వ్యాక్సినేషన్‌పై సీఎస్ సమీక్ష

హైదరాబాద్‌: రాష్రంలో కరోనా నియంత్రణ కోసం జరుగుతున్న వ్యాక్సినేషన్‌పై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. గ్రేటర్‌లో వంద శాతం వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. సోమవారం నుంచి ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని సీఎస్ సూచించారు. హైదరాబాద్ మహానగరంలో 175 మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. పదిహేను రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి కావాలని లక్ష్యంతో పనిచేయాలన్నారు. నగరంలోని 4846 కాలనీలు, స్లమ్స్, 360 కంటైన్మెంట్ జోన్లలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను సోమేశ్ కుమార్ ఆదేశించారు. 

Updated Date - 2021-08-22T00:17:55+05:30 IST