అధికార పార్టీ ప్రతినిధిలా సీఎస్‌

ABN , First Publish Date - 2021-05-08T08:58:52+05:30 IST

కరోనా కట్టడికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌.. అధికార పార్టీ ప్రతినిధిలాగా ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారిగా వ్యవహరించట్లేదని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు.

అధికార పార్టీ ప్రతినిధిలా సీఎస్‌

కరోనా కట్టడిపై అబద్ధాలు చెబుతున్నారు: కోదండ 

హైదరాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌.. అధికార పార్టీ ప్రతినిధిలాగా ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారిగా వ్యవహరించట్లేదని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. కరోనా విషయంలో సీఎం కేసీఆర్‌, సీఎ్‌సలు చెబుతున్నదానికి, వాస్తవాలకూ పొంతనే లేదన్నారు. కొవిడ్‌ పరీక్షలు, వ్యాక్సిన్‌ నుంచి ఆక్సిజన్‌ వరకు అన్నింటికీ క్యూలేనని, దురదృష్టవశాత్తూ చనిపోతే చితి దగ్గర కూడా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు తగ్గుతున్నట్లుగా సీఎస్‌ మరో అబద్ధం చెబుతున్నారని, వాస్తవానికి పరీక్షలు చేయట్లేదు కాబట్టే కేసులూ తగ్గాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

Updated Date - 2021-05-08T08:58:52+05:30 IST