రోగులను పరామర్శించిన సీఎంపై విమర్శలా?
ABN , First Publish Date - 2021-05-24T10:56:32+05:30 IST
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శించడం బాధ్యతా రాహిత్యమని మంత్రి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు.

విపక్షాల తీరు బాధ్యతారాహిత్యం: శ్రీనివా్‌సగౌడ్
మహబూబ్‌నగర్, మే 23: ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శించడం బాధ్యతా రాహిత్యమని మంత్రి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేశారని, గాంధీ, వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం కల్పించారని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కరోనా రోగుల కోసం ఇంతకన్నా మెరుగైన చర్యలు ఏం తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.