వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
ABN , First Publish Date - 2021-11-28T05:30:00+05:30 IST
వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

అధ్యక్ష, కార్యదర్శిలుగా ప్రవీణ్‌గౌడ్, శ్రీనివాస్ నియామకం
హనుమకొండ స్పోర్ట్స్, నవంబరు 28: ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్‌లోని ఆర్‌జీఎస్ క్రికెట్ అకాడమీలో బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రవీణ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా చాగంటి శ్రీనివాస్ విజయం సాధించారు. చాగంటి శ్రీనివాస్, సాగర్ ఫ్యానల్ నడుమ సాగిన హోరాహోరి పోరులో శ్రీనివాస్ ప్యానల్ విజయం సాధించింది. అధ్యక్షుడిగా ప్రవీణగౌడ్ తన సమీప ప్రత్యర్థి విజయ్‌పై 29-11 ఓట్ల తేడాతో గెలుపొందాడు. కార్యదర్శిగా బరిలో ఉన్న చాగంటి. శ్రీనివాస్ సమీప ప్రత్యర్థి సాగర్‌పై 30-10 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా జయప్రకష్, జమీర్, నజీముద్దిన్, రఘురామ్, స్వామిచరణ్, జాయంట్ సెక్రటరీగా ఉపేందర్, కోశాధికారిగా టి.శ్రీనివాస్, కార్యవర్గసభ్యులుగా వేణుగోపాల్, అభినవ్ వినయ్, మట్టెడ కుమార్, రాములు, గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమ్మిరెడ్డి తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం 2024 సంవత్సరం వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.