నేరాల జోరుకు ముకుతాడు పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి

ABN , First Publish Date - 2021-12-31T05:49:07+05:30 IST

నేరాల జోరుకు ముకుతాడు పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి

నేరాల జోరుకు ముకుతాడు  పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి

వరంగల్‌ క్రైం, డిసెంబరు 30 : గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని, కమిషనరేట్‌లో శాంతి భద్రతలు కాపాడటంలో సఫలీకృతమయ్యామని, గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌, హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ఛాలెంజ్‌గాతీసుకుని ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్టు సీపీ తరుణ్‌జోషి తెలిపారు. ఖిలావరంగల్‌ కోట ఖుష్‌మహల్‌లో గురువారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన 2021 పోలీస్‌ వార్షిక నివేదికను విడుదల చేశారు.  కొవిడ్‌ లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌, సుప్రీంకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ వరంగల్‌ పర్యటనను విజయవంతం చేసినట్టు పేర్కొన్నారు. 

పెరిగిన నేరాలు... రికవరీలు

2020తో పోల్చితే 2021లో నేరాల సంఖ్య పెరిగిందన్నారు. దొంగతనాల సం ఖ్య తగ్గినా దారి దోపిడీలు, హత్యలు, కిడ్నా్‌పలు, రేప్‌ కేసులు, రోడ్డు ప్రమాదా లు స్వల్పంగా పెరిగాయన్నారు. కొవిడ్‌ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పో యి, కొందరు ఆర్థిక అవసరాల కోసం నేరాలకు పాల్పడ్డారని వివరించారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ యంత్రాంగం ప్రజల సహకారంతో నిందితులను అరెస్ట్‌ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. గత ఏడాది 34 హత్యలు జరిగి తే, ఈ ఏడాది  51 ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. అలాగే కమిషనరేట్‌ పరిధిలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో 402 మంది మృత్యువాత పడితే, మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు వివరించారు. ఈఏడాది 174 మంది కిడ్నా ్‌పనకు గురవగా 85 అత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు. గత ఏడాది రూ.99లక్షల సొత్తు చోరీ కాగా, రూ.32లక్షలు స్వాధీనం చేసుకోగా ఈ ఏడాది వివిధ ఘటనల్లో రూ. 6కోట్లకు పైగా సొత్తు చోరీకి గురవగా రూ.2.5కోట్లు రికవరీ చేశామన్నారు. 

సైబర్‌ నేరగాళ్ల విజృంభణ

 ఈ ఏడాది కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని సీపీ తెలిపారు. డి సెంబరు 15 నాటికి 129 కేసులు నమోదవగా రూ.5.12కోట్ల సొత్తు మాయం చేసినట్లు వెల్లడించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో 21 కేసులను ఛేదించి 17 మంది నిందితులను అరెస్ట్‌ చేసి రూ.1.50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సైబర్‌ నేరాలపైచైత న్యం కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలు, షాపింగ్‌ మాల్స్‌, గృహసముదాయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 

టాస్క్‌ఫోర్స్‌తో నేరాలకు చెక్‌

కమిషనరేట్‌లో నేరాలను అదుపు చేసేందుకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ టీం సత్ఫలితాలు సాధించిందని సీపీ  వెల్లడించారు. ప్రధానంగా గంజాయి, గుట్కా, మట్కా, పేకాట, వ్యభిచారం లాంటి నేరాలను అదుపు చేయడంలో విజయంతమైనట్లు తెలిపారు. ఈ ఏడాది సుమారు 270 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. నకిలీ కరెన్సీ, ఇన్సూరెన్స్‌, చైన్‌ స్నాచింగ్‌, ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న నేరస్థుల ఆట కట్టించినట్లు తెలిపారు. 

కరుడుగట్టిన నేరస్థులకు జీవితఖైదు

సంచలనం కలిగించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్యల కేసులో నేరస్థు డు సంజయ్‌కుమార్‌కు జైలుశిక్ష ఖరారు చేయడంలో కమిషనరేట్‌ పోలీసులు సక్సెస్‌ అయినట్లు సీపీ వివరించారు. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన సాక్ష్యాధారాల మేరకు నేరస్థుడికి మరణశిక్ష ఖరారైనట్లు తెలిపారు. అదే విధంగా కాజీపేట, వరంగల్‌, వర్ధన్నపేట, మామునూర్‌ డి విజన్‌లకు సంబంధించి 16 మంది నేరస్థులకు జీవితఖైదు ఖరారు అవడం కమిషనరేట్‌ పోలీసుల కేసుల విచారణలో పారదర్శకతకు నిదర్శనమన్నారు. సమావేశంలో డీసీపీలు పుష్పారెడ్డి, వెంకటలక్ష్మి, సీతారాం, అడిషనల్‌ డీసీపీలు సాయిచైతన్య, వైభవ్‌ గైక్వాడ్‌, భీంరావ్‌, సంజయ్‌, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T05:49:07+05:30 IST