‘ఈటల’పై వేటు రాజకీయాల్లో పెనుమార్పులకు సంకేతమా?

ABN , First Publish Date - 2021-05-02T12:47:57+05:30 IST

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటలపై వేటు తెలంగాణా రాష్ట్ర రాజకీయాలలో

‘ఈటల’పై వేటు రాజకీయాల్లో పెనుమార్పులకు సంకేతమా?

హైదరాబాద్‌ : వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటలపై వేటు తెలంగాణా రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులకు సంకేతమేనా అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రపరిధిలో విచారణ కన్నా ఉన్నతస్థాయి విచారణ అవసరం కాదా? అని ఆయన శనివారం విడుదల చేసిన ప్రకటనలో ప్రశ్నించారు. మంత్రి ఈటలపై వేటుకు, ప్రస్తుతం లభించిన ఆధారాలు సరితూగడం లేదన్నారు. అలా అయితే మంత్రి వర్గంపై ప్రజలకు సైతం సందేహాలు ఏర్పడతాయన్నారు.  ఇప్పుడు కాకపోయినా భవిష్యత్‌లోనైనా ఈటల బాణం గురిపెట్టే ఉంటుందేమో చూద్దామని ఈ సందర్భంగా నారాయణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-05-02T12:47:57+05:30 IST