దళితుడి భూమిని ఆక్రమించడం సరికాదు

ABN , First Publish Date - 2021-02-02T04:33:52+05:30 IST

దళితుడి భూమిని ఆక్రమించడం సరికాదు

దళితుడి భూమిని ఆక్రమించడం సరికాదు

సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి మల్లేశ్‌

టేకుమట్ల, ఫిబ్రవరి 1: మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దళితుడు మైస రాజయ్య భూమిని ఆక్రమించడం సరికాదని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేశ్‌ అన్నారు. తమ భూమిని తమకు తిరిగి కేటాయించాలని రాజయ్య కుటుంబం  తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో చేస్తున్న నిరవధిక దీక్ష  సోమవారం మూడో రోజుకు చేరింది.  దీక్షాశిబిరాన్ని మల్లేశ్‌తోపాటు  యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్‌ సందర్శించారు.  పల్లె పకృతి వనం ఏర్పాటు పేరుతో రాజయ్యకు చెందిన వ్యవసాయ భూమిని ఆక్రమించడం సరికాదన్నారు. కలెక్టర్‌ స్పందించి దళితుడైన రాజయ్యకు  న్యాయం చేయాలని కోరారు. ఈ దీక్షలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఉపాధ్యాక్షుడు ఎలుకటి రాజయ్య, మండల అధ్యక్షుడు రేణుకుంట్ల రాము, మైస రాంచందర్‌, సదానందం, సుదర్శన్‌, మేర్గు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-02T04:33:52+05:30 IST