భూ పోరాటలు చేస్తాం: చాడ వెంకట్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-05T00:09:10+05:30 IST

పేదలకు భూములు పంచే వరకు భూ పోరాటలు చేస్తామని సీపీఐ

భూ పోరాటలు చేస్తాం: చాడ వెంకట్ రెడ్డి

హన్మకొండ: పేదలకు భూములు పంచే వరకు భూ పోరాటలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలో జరుగుతున్న సీపీఐ వరంగల్ ఉమ్మడి జిల్ల్లాల రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నదన్నారు. రైతుల పట్ల కేంద్ర,రాష్ట్రా ప్రభుత్వాలు వివక్ష చూపిస్తున్నాయన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనునగోలు చేయాలని ఈ నెల7న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆందోళనలు చేస్తామ్నారు. 9న ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 
Updated Date - 2021-12-05T00:09:10+05:30 IST