త్యాగధనుల ఆశయాలను కొనసాగిద్దాం..
ABN , First Publish Date - 2021-10-22T05:04:47+05:30 IST
త్యాగధనుల ఆశయాలను కొనసాగిద్దాం..
పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి
ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
హనుమకొండ క్రైం, అక్టోబరు 21: పోలీసు అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని, వారి స్ఫూర్తితో విధుల్లో రా ణిస్తూ ప్రజలకు మెరుగైౖన సేవలందించాలని వరంగల్ పో లీసు కమిషనర్ తరుణ్‌జోషి అన్నారు. వరంగల్ పోలీసు క మిషనరేట్ కార్యలయంలో పోలీసు అమరుల స్మృతి స్థూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్)డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గత యే డాది నుంచి ఇప్పటివరకు దేశంలో అమరులైన 377మంది పోలీసు అమరుల పేర్లను వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి చదివి వినిపించారు.
కార్యక్రమానికి సీపీ తరుణ్‌జోషి, జిల్లా న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు, వరంగల్ కలెక్టర్ బి.గోపి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, డీసీపీలు వెంకటలక్ష్మి, పుష్ప, ఏసీపీ వైభవ్ గైక్వాడ్‌లతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు అమరుల కుటుంబసభ్యులు హాజరయ్యారు. స్మృతి స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. స్మృతివనంలో అమరవీరుల కు టుంబ సభ్యులు వారి అమరుడి శిలాఫలకం వద్దకు వెళ్లి కన్నీరుపెట్టారు. సాయుధ పోలీసులు ఆర్‌ఐ శెట్టి శ్రీనివా్‌సరావు సారథ్యంలో ‘శోక్ శస్త్ర్’ పరేడ్ నిర్వహించి పోలీసు అమరులకు నివాళులు తెలిపారు. పోలీసు అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌ నం పాటించారు.
ఈ సందర్భంగా సీపీ తరుణ్‌జోషి మాట్లాడుతూ.. ప్రజ ల సేవకోసం తమ ప్రాణాలను అర్పించిన త్యాగధనులు పోలీసు అమరులని, వారి సేవలు గుర్తుంచుకుని ప్రజలకు సేవచేసి గుర్తింపు పొందాలన్నారు. పోలీసు అమరుల మార్గదర్శకాలను అనుసరిస్తూ పని చేయాలన్నారు. ప్రజల్లో మంచిపేరు రావాలంటే చిత్తశుద్ధి, క్రమశిక్షణ, నీతి, నిజాయితీతో పని చేయాలని సిబ్బందికి సూచించారు.
రక్తదాన శిబిరం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏఆర్, వరంగల్ ట్రాఫిక్ పోలీసుల సంయుక్తాధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సీపీ తరుణ్‌జోషి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రధా నం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు బాలస్వామి, శ్రీనివాస్, నాగన్న, సురేందర్, ఆర్‌ఐలు శ్రీనివా్‌సరావు, భాస్కర్, హతిరాం, నగేశ్, ట్రాఫిక్ సీఐలు నరేష్, విజయ్‌కుమార్, ప్రభాకర్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శాంతి ర్యాలీ
అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్) డేను పురస్కరించుకుని కార్యక్రమం అనంతరం వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయం నుంచి మిషన్ ఆస్పత్రి వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. జాగృతి కళాబృందం ప్రత్యేక వాహనంపై పోలీసుల అమరుల త్యాగాలను స్మరిస్తూ గీతాలు ఆలపించింది. పోలీసు ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, సాయుధ పోలీసులు ఈ ర్యాలీలో పెద్దఎత్తున పాల్గొన్నారు. మిషన్ ఆస్పత్రి నుంచి తిరిగి ర్యాలీ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో అదనపు అదనపు డీసీపీలు భీంరావు, సంజీవరావు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలతో పాటు పోలీసు సిబ్బంది, పోలీసు అమరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.