వీర జవాన్లకు తెలంగాణ ప్రభుత్వం నివాళి: సీపీ సజ్జనార్
ABN , First Publish Date - 2021-04-06T15:30:20+05:30 IST
ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన వీరజవాన్లకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ నివాళులర్పించనట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్, బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన వీరజవాన్లకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ నివాళులర్పించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. అమరులైన వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. అమరులైన వీర జవాన్ల కుటుంబ సభ్యులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సిఆర్పీఎఫ్ అధికారులు అన్ని విధాలా ఆదుకుంటారని అన్నారు. నక్సలిజం సమసిపోయినా.. అక్కడక్కడ కొన్ని ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, వీర జవాన్లు అమరులైనప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో పోరాడి వారి ఆశయాన్ని నెరవేరుస్తామని సజ్జనార్ పేర్కొన్నారు.