గూగుల్‌పే ద్వారా చెల్లిస్తున్నట్లు తేలింది: సీపీ అంజనీ కుమార్

ABN , First Publish Date - 2021-10-28T21:39:01+05:30 IST

గత నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిపై స్పెషల్ డ్రైవ్ జరుగుతుందని సీపీ అంజనీ కుమార్ చెప్పారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఇద్దరు గంజాయి సప్లై చేస్తున్న వారిని టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.

గూగుల్‌పే ద్వారా చెల్లిస్తున్నట్లు తేలింది: సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్: గత నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిపై స్పెషల్ డ్రైవ్ జరుగుతుందని సీపీ అంజనీ కుమార్ చెప్పారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఇద్దరు గంజాయి సప్లై చేస్తున్న వారిని టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నరసింగ్ సింగ్, రామవత్ రమేష్‌ను అరెస్ట్ చేశామన్నారు. వీరు ఇద్దరికి వేరే రాష్ట్రాలతో లింక్స్ ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇద్దరి నుండి 70 కిలోల గంజాయితో పాటు ఆటోను సీజ్ చేశామన్నారు. గంజాయి కొనుగోలు అంత గూగుల్‌పే ద్వారా చెల్లిస్తున్నట్లు తేలిందన్నారు. 2021 లో 114 పీడీ యాక్ట్‌లు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇందులో 31 మంది డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారు ఉన్నారని తెలిపారు. 


 

Updated Date - 2021-10-28T21:39:01+05:30 IST