మరణాల పరిహారానికి దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2021-11-26T05:40:14+05:30 IST

మరణాల పరిహారానికి దరఖాస్తుల స్వీకరణ

మరణాల పరిహారానికి దరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి కలెక్టరేట్‌, నవంబరు 25: కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా అందిస్తుండగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు జిల్లా నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 165 దరఖాస్త్తులు రాగా మరిన్ని వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లాలో ముగ్గురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. చైర్మన్‌గా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌వో  సభ్యులుగా ఉంటారు. కొవిడ్‌తో మృతి చెందిన వారి  ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు రిపోర్టు, సంబంధిత మెడికల్‌ ఆఫీసర్‌ ఽధ్రువీ కరణ పత్రం, డెట్‌ సర్టిఫికెట్‌తో మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని డీఎం హెచ్‌వో శ్రీరామ్‌ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందితే అక్కడి ధ్రువీకరణ పత్రం,  చికిత్స పొందిన వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. చికిత్స పొందిన తర్వాత ఇంటి వద్ద చనిపోయినా  చికిత్స, కొవిడ్‌ నిర్ధారణ పత్రాలతో  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


Updated Date - 2021-11-26T05:40:14+05:30 IST