రాష్ట్రంలో కొత్తగా 184 కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-10-14T09:02:20+05:30 IST

రాష్ట్రంలో 184 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 55, కరీంనగర్‌లో...

రాష్ట్రంలో కొత్తగా 184 కొవిడ్‌ కేసులు

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 184 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 55, కరీంనగర్‌లో 11, నల్లగొండ, మేడ్చల్‌ జిల్లాల్లో 10, రంగారెడ్డిలో 14కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం 4,211 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇన్ఫెక్షన్‌తో మరొకరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 3,934కు పెరిగింది. బుధవారం 38,834 మందికి పరీక్షలు చేశారు. 

Updated Date - 2021-10-14T09:02:20+05:30 IST