ఏఐ, మిషన్‌లెర్నింగ్‌లో హెచ్‌సీయూలో కోర్సులు

ABN , First Publish Date - 2021-08-20T08:56:51+05:30 IST

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌లో ఒక సంవత్సరం డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హైదరాబాద్‌

ఏఐ, మిషన్‌లెర్నింగ్‌లో హెచ్‌సీయూలో కోర్సులు

రాయదుర్గం, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌లో ఒక సంవత్సరం డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. హెచ్‌సీయూలోని ది సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చువల్‌ లెర్నింగ్‌(సీడీవీఎల్‌) ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రోగ్రాంలో వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌(ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్‌, ఐటీ ప్రొఫెషనల్స్‌, మార్కెటింగ్‌ సేల్స్‌పర్సన్స్‌, మేనేజర్లు)తో పాటు గ్రాడ్యుయేట్‌ ఫ్రెషర్స్‌ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబరు 5 చివరి తేదీ అని అధికారులు పేర్కొన్నారు. ఇతర వివరాలకు 80808 06983, 040-24600264 నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు.

Updated Date - 2021-08-20T08:56:51+05:30 IST