నకిలీ కరెన్సీ ముఠా ఆటకట్టు

ABN , First Publish Date - 2021-08-20T09:02:07+05:30 IST

నకిలీ కరెన్సీని ప్రింట్‌ చేసి చలామణి చేస్తున్న ఐదుగురు సభ్యు ల గ్యాంగ్‌ను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. వారి నుంచి రూ.16 లక్షల

నకిలీ కరెన్సీ ముఠా ఆటకట్టు

ఐదుగురి అరెస్టు... రూ.16 లక్షల ఫేక్‌ కరెన్సీ స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నకిలీ కరెన్సీని ప్రింట్‌ చేసి చలామణి చేస్తున్న ఐదుగురు సభ్యు ల గ్యాంగ్‌ను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. వారి నుంచి రూ.16 లక్షల నకిలీ కరెన్సీతోపాటు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. గురువారం సీపీ అంజనీకుమార్‌ ఈ వివరాలు వెల్లడించారు. సిద్దిపేట ప్రాంతానికి చెందిన చుక్కాపురం  ఫొట్రోగాఫర్‌ సంతోష్‌కుమార్‌, కొరియర్‌ వ్యాపారం చేసే సాయికుమార్‌ నకిలీ కరెన్సీని ప్రింట్‌ చేసి చలామణి చేద్దామనుకున్నారు. ఫొటోషా్‌పపై అవగాహన ఉండటంతో నకిలీ కరెన్సీ తయారీ ప్రారంభించారు. ఈ ప్రక్రియలో సాయం చేయాలంటూ అదే ప్రాంతానికి చెందిన బీఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌ సుంకరి శ్రీనివాస్‌, ధర్మాజి నీరజ్‌కుమార్‌, జలిగమ్‌ రాజులను అడిగారు. వారికి 10 శాతం కమీషన్‌ ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ప్లాన్‌ ప్రకారం.. సంతోష్‌, సాయి కలిసి ల్యాప్‌టాప్‌, ఓ కలర్‌ ప్రింటర్‌ కమ్‌ స్కానర్‌లను రూ.3వేలు వెచ్చించి అద్దెకు తీసుకున్నారు.


సిద్దిపేటలో ఓ గదిని అద్దెకు తీసుకుని అక్కడే కరెన్సీ ముద్రణ ప్రారంభించారు. ఒరిజినల్‌ రూ.500 నోటును కాపీ చేసి ప్రింట్‌ చేయసాగారు. ప్రింట్‌ చేసిన వాటిని మిగతా నిందితుల సాయంతో ఒక్క ఒరిజినల్‌ నో టుకు మూడు నకిలీ నోట్లు ఇచ్చేస్తూ దందా సాగించారు.  దందా హైదరాబాద్‌కు పాకింది. యూసు్‌ఫగూడ చెక్‌పోస్టు వద్ద నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయన్న స మాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ దాడులు నిర్వహించింది. ఐదుగురిని అదుపులోకి తీసుకుని  రూ.16 లక్షల విలువ చేసే నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2021-08-20T09:02:07+05:30 IST